Sunday, April 28, 2024

Animal Beauty : తృప్తి డిమ్రి గ్లామ‌ర్ షో…

గత ఏడాది చివర్లో వచ్చిన యానిమల్‌ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా, కీలక పాత్రలో తృప్తి డిమ్రి నటించింది. రష్మిక మందన్న పాత్ర కంటే కూడా ఎక్కువగా తృప్తి పోషించిన జోయా పాత్ర కు ఆధరణ దక్కింది. రణబీర్ కపూర్ తో తృప్తి డిమ్రి చేసిన రొమాన్స్ కు కుర్రకారు ఫిదా అయ్యారు. అంతకు ముందు వరకు తృప్తి గురించి పెద్దగా తెలియదు.

- Advertisement -

ఆమె బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో కొద్ది మందికి మాత్రమే సుపరిచితురాలు. కానీ ఇప్పుడు ఆమె సోషల్‌ మీడియాను పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకులు ఫాలో అవుతున్నారు. అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఆమెను అభిమానిస్తూ ఉన్నారు. అలాంటి అందాల తృప్తి డిమ్రి సోషల్‌ మీడియాలో షేర్ చేసే ఫోటోలు రెగ్యులర్‌ గా నెటిజన్స్ దృష్టిని ఆకర్షించడంతో పాటు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా మరోసారి తృప్తి డిమ్రి అందాల షో తో అదరగొట్టింది. థైస్ అందాలను చూపిస్తూ చాలా ట్రెండీ అండ్ స్టైలిష్ లుక్ లో కెమెరా కు ఫోజ్ ఇచ్చింది. కన్నుల విందు చేసే విధంగా, చూపు తిప్పుకోనివ్వని అందంతో తృప్తి ఇచ్చిన అందాల ఫోటో ఫోజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. యానిమల్‌ క్రేజ్ తో ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement