Saturday, April 27, 2024

Nidhi Agarwal : చంద‌మామ‌నే ఊరించేలా ….

సవ్యసాచితో తెలుగు తెరకు పరిచయమైన నిధి అగర్వాల్ అంతకుముందే తన సోషల్ మీడియా క్రేజ్ తో సౌత్ లో సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. క్రికెటర్ తో డేటింగ్ వార్తలతో అమ్మడి గురించి మరింత మందికి తెలిసింది. అక్కినేని హీరోతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిధి ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలో నిధి అందాలను పూరీ పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత కెరీర్ దూకుడు చూపిస్తుంది అనుకుంటే అమ్మడు సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది.

తెరపైకి బోల్డ్ నటి రియల్‌ లైఫ్ తెలుగు కన్నా తమిళ పరిశ్రమ మీద ఎక్కువ దృష్టి పెట్టిన నిధి అగర్వాల్ అక్కడ క్రేజీ ఫ్యాన్స్ ని ఏర్పరచుకుంది. నిధి కోసం అక్కడ అభిమాన సంఘాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారంటే కోలీవుడ్ లో అమ్మడి క్రేజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. గల్లా అశోక్ లీడ్ రోల్ లో చేసిన హీరో సినిమాలో నటించిన నిధి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో కూడా నటిస్తుంది.

ప్రతి హీరోయిన్ ఇన్ స్టాగ్రాం లో ఫోటో షూట్స్ చేస్తుంటారు. కానీ కొందరికి మాత్రమే రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారు. అలాంటి భామల్లో నిధి అగర్వాల్ ఒకరు. లేటెస్ట్ గా అమ్మడు మూన్ లైట్ కలర్ శారీలో అందాలను వెదచల్లుతుంది. కట్టింది శారీనే అయినా ఆమె చేస్తున్న గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక నిధి చేసిన ఈ ఫోటో షూట్స్ కి నింగిలోన చందమామ భూమీదకు వచ్చిందేంటి అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement