Friday, May 31, 2024

Ashika Ranganath : చిరు మూవీలో అషికా…

మెగాస్టార్‌ సినిమాలో నటించే అవకాశం నాయికలకు వచ్చిందంటే వారికి కెరీర్‌ పరంగా ప్రమోషన్‌ వచ్చినట్టు పేర్కోవాలి. చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రంలో కన్నడ నటి ఆషికా రంగనాథ్‌ ఛాన్స్‌ వచ్చింది. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ చిత్రంలో చిరుకు జోడీగా ఆషికా రంగనాథ్‌ నటించనుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.

- Advertisement -

అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని సొంతం చేసుకోవడం కోసం అభిమానులు సిద్ధంగా ఉండాలని కూడా పేర్కొంది. ఆషికా రంగనాథ్‌ ‘ అమిగోస్‌’ సినిమా ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగార్జున హీరోగా నటించిన ‘నా సామిరంగ ‘ చిత్రంలో మెరిసింది. మూడవ అవకాశాన్ని చిరంజీవి సరసన దక్కించుకుంది.

‘విశ్వంభర’ ఫాంటసీ కథతో తెరకెక్కుతోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఎ్కకువ శాతం స్పెషల్‌ ఎఫెక్టులు ఉంటాయని తెలిసింది. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్టు దర్శకుడు వశీష్ట పేర్కొన్నారు. చిరంజీవి గత చిత్రాలతో పోలిస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఐదుగురు నాయికలు నటిస్తారని తెలిసింది. ఇప్పటికే త్రిష పేరును ప్రకటించి ఉన్నారు. తాజాగా ఆషికా రంగనాథ్‌ కూడా చేరింది. ఇంకా ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి, సురభి నటిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. సంగీతం కీరవాణి, ఛాయాగ్రహణం చోటా కె.నాయుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement