Monday, June 10, 2024

Paid Busses – సిటీ లో డీలక్స్ బస్సులు వచ్చేస్తున్నాయి….

జులై నుంచి 125 కొత్త బ‌స్సులు
టిక్కెట్స్ హోల్డ‌ర్స్ మాత్ర‌మే ప్ర‌వేశం
ఉచిత మ‌హాల‌క్ష్మీల‌కు నో ఎంట్రీ
సీజ‌న్ పాస్ లో అనుమ‌తి నిల్
పెయిడ్ స‌ర్వీస్ పేరుతో డీల‌క్స్ బ‌స్సులు
సాధార‌ణ బ‌స్సుల‌లో ర‌ద్దీ త‌గ్గించేందుకు
టిఎస్ ఆర్టీసీ నిర్ణ‌యం ..

హైదరాబాద్ నగరంలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు మారనున్నాయి. తాజాగా 25 ఎలక్ట్రిక్‌ ఏసీ, 25 నాన్‌ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు నగరానికి రాగా మరో 450 ఎలక్ట్రిక్‌ బస్సులు జులై నాటికి రోడ్డెక్కనున్నాయి. మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. సిటీలో ప్ర‌యాణించేందుకు వీలుగా 125 డీలక్స్‌ బస్సులను సమకూర్చుతోంది. ఇవి జులై నుంచి అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -

నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లో డీలక్స్‌ బస్సులు నడపనున్నారు. సిటీ, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ బ‌స్సుల‌లో టెకెట్ హోల్డ‌ర్స్ ప్ర‌యాణిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు.. కిట‌కిట‌లాడుతూ వ‌స్తున్న బ‌స్సులు ఎక్క‌లేక వేలాది మంది ప్ర‌యాణీకులు వేరే రవాణ స‌దుపాయాల వైపు మొగ్గు చూపుతున్నారు.. దీంతో ఆ ప్ర‌యాణీకులు సౌకర్యవంతంగా వెళ్లేందుకు వీలుగా ఈ డీలక్స్‌ బస్సుల‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.. ఉచిత మ‌హాలక్ష్ముల‌ను, పాస్ హోల్డ‌ర్స్ ను ఈ బ‌స్సుల‌లోకి అనుమ‌తించారు.. పేయిడ్ స‌ర్వీస్ పేరుతో ఈ బ‌స్సుల‌ను న‌డ‌ప‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement