Thursday, May 16, 2024

వీడు మాములోడు కాదు.. 66 ఏళ్ల వయసులో 17వ పెళ్లి

మాములుగా ఒక పెళ్లి చేసుకోవాలంటేనే నానా తిప్పలు పడే రోజులు ఇవి. కానీ జింబాబ్వే దేశంలోని ఓ వ్యక్తి ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నాడో తెలిస్తే మీ మతి పోవడం ఖాయం. జింబాబ్వే మాజీ సైనికుడు మిషెక్ న్యాండోరో ఇప్పటివరకు 16 పెళ్లిళ్లు చేసుకుని, ఏకంగా 151 మంది సంతానాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు 66 ఏళ్ల వయసులోనూ మరో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అయితే ఇప్పటివరకు 16 మంది భార్యలు, 151 మంది పిల్లలతో కుటుంబ పోషణ ఎలా జరుగుతోందన్న సందేహాలపై మిషెక్ స్పందించాడు.

తన కుటుంబంలో పెద్ద పిల్లలు సంపాదిస్తున్నారని, వాళ్ల సంపాదనతో జీవితం సాఫీగా సాగిపోతోందని స్పష్టం చేశాడు. భార్యలతో హాయిగా జీవించడమే తన పని అన్నాడు. 1000 మంది పిల్లలను కనడమే తన లక్ష్యం అన్నాడు, చచ్చేలోపు అది సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఏ భార్య బాగా రుచిగా వండితే ఆరోజుకు ఆమె వద్దే తన భోజనం అని, త్వరలోనే 17వ పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపాడు. తాను ఇప్పటివరకు చేసుకున్న అన్ని పెళ్లిళ్లు భార్యలకు చెప్పిన తర్వాతే చేసుకున్నానని, వారి అంగీకారంతోనే ఇన్ని పెళ్లిళ్లు జరిగాయని మిషెక్ పేర్కొన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement