Monday, April 29, 2024

తెలంగాణ లో టెస్టులు తగ్గుతున్నాయి…ప్రాణాలు పోతున్నాయి

తెలంగాణలో రోజు రోజుకి కేసులు పెరుగుతున్నప్పటికీ టెస్ట్ లు మాత్రం తగ్గిస్తూ వస్తుంది సర్కారు. మొదట లక్షకుపైగా టెస్ట్ లు చేశారు. కానీ ఇప్పుడు 70వేల టెస్ట్ లకు చేతులు ఎత్తేస్తుంది. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో 71,221 టెస్టులు చేయగా.. 4,693 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 734 కేసులు గ్రేటర్ పరిధిలో నమోదయ్యాయి.

ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం కేసుల సంఖ్య 5,16,404కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో 33 మంది కరోనా తో మృతి చెందారు. దీనితో మొత్తం మృతుల సంఖ్య 2,863కి పెరిగింది. మరోవైపు 24 గంటల్లో 6,876 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 56,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement