Saturday, May 4, 2024

మార్కెట్ల‌ పై ప్రభావితం చేసిన జెలెన్‌ స్కీ ప్రకటన..

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ చేసిన ఒకే ఒక్క ప్రకటన.. ప్రపంచంలోని అన్ని దేశాల స్టాక్‌ మార్కెట్లను లాభాల్లోకి తీసుకొచ్చాయి. దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు పరుగులు పెట్టాయి. జెలెన్‌ స్కీ ప్రకటనతో బుల్‌ రంకేలిసింది. ఇంతకీ జెలెన్‌ స్కీ ఏం ప్రకటన చేశారంటే.. నాటో తమకు సభ్యతం ఇచ్చేలా లేదని, తమను నాటోలో చేర్చుకోవడానికి కూడా సిద్ధం లేదని, ఇక తాను నాటో సభ్యత్వం కోసం ఒత్తిడి చేయబోననే ప్రకటన.. ప్రపంచ దేశాల మార్కెట్‌లను భారీ లాభాల్లోకి వచ్చేలా చేశాయి. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ.. దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడం గమనార్హం. మంగళవారం నాటి జోరే.. బుధవారమూ కొనసాగింది. రష్యాపై చమురు ఆంక్షలకు సంబంధించి ఐరోపా దేశాలు అమెరికాతో కలిసి రాకపోవడం, దేశీయంగా ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్‌ సరే ఫలితాలు కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఉండటం లాంటి కీలక అంశాలు బుల్‌ రంకెలేందుకు కారణాలు అయ్యాయి. ప్రధానంగా కనిష్టాల వద్ద కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది.

రష్యా డిమాండ్స్‌లో ఒకటి..

నాటోలో ఉక్రెయిన్‌ చేరిక అంశం అనేది రష్యా ప్రధాన డిమాండ్‌లో ఒకటి. నాటో విషయంలో జెలెన్‌ స్కీ చేసిన కీలక ప్రకటనతో.. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయన్న ఇన్వెస్టర్ల ఆలోచనలు.. మార్కెట్లను లాభాల వైపు పరుగులు పెట్టించాయి. దేశీయంగా చూసుకుంటే.. రెండేళ్ల తరువాత అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం అవుతున్నాయి. 27 నుంచి ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన కూడా లాభాలకు కారణమైంది. దీనికితోడు రష్యా నుంచి అమెరికా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఉక్రెయిన్‌పై రష్యా వైఖరిని నిరసిస్తూ.. క్రూడాయిల్‌ దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ విషయంలో ఐరోపా దేశాలు వెనుకడుగు వేశాయి. దీంతో చమురు ధరలు మరింత పెరగకుండా ఐరోపా దేశాల నిర్ణయం కొంత మేర ఇక్కడ పని చేసినట్టు నిపుణులు భావిస్తున్నారు. దేశీయంగా ఇంధన ధరల పెంపు అనేది.. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఉంటుందన్న పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ ప్రకటన కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement