Friday, May 10, 2024

భారీ లాభాల్లో మార్కెట్లు.. కోలుకుంటున్న సూచీలు..

నాలుగు రోజుల పాటు వరుస నష్టాల నుంచి మంగళవారం కోలుకున్న సూచీలు.. బుధవారం కూడా దూసుకెళ్లాయి. ఉదయం సెన్సెక్స్‌ 53,793.99 పాయింట్ల వద్ద బలంగా ప్రారంభమై.. ఇంట్రాడేలో 54,893.73 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం తరువాత మరింత పుంజుకున్న సూచీ చివరికి 1223.24 పాయింట్ల లాభంతో 54,647.33 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 331.90 పాయింట్లు ఎగబాకి.. 16,345.35 పాయింట్ల వద్ద క్లోజ్‌ అయ్యింది. నిఫ్టీ 50 షేర్లలో 40 షేర్లు రాణించాయి. ఇంధనం, స్థిరాస్తి, ఆటో, ఇండస్ట్రియల్‌, ఆర్థిక రంగ సూచీలు లాభపడ్డాయి. లోహ, సీపీఎస్‌ఈ, ఉపకరణాలు, విద్యుత్‌ రంగాల షేర్లు నష్టపోయాయి.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. రూ.7.2 లక్షల కోట్ల లాభాలను ఇన్వెస్టర్లు తమ జేబుల్లో వేసుకున్నారు. బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల క్యాపిటలైజేషన్‌ రూ.7.21 లక్షల కోట్లు పెరిగి.. రూ.2 కోట్ల 48లక్షల 32వేల 780 కోట్లకు పెరిగింది. మంగళవారం రూ.2.51లక్షల కోట్లు జంప్‌ అయ్యింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement