Tuesday, May 7, 2024

యువత తమ విలువైన సమయాన్ని వృధా చేయొద్దు: ఏసీపీ మహేశ్‌

యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని బెల్లంపల్లి ఏసీపీ మహేశ్‌ పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత భవిత అనే కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడుతూ ఆధునిక కాలంలో వస్తున్నసాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు సాగుతుండగా మరికొందరు లక్ష్యం లేకుండా సరదాలు, సెల్‌ఫోన్లకు, మద్యానికి, డ్రగ్స్‌కు అలవాటై తమ జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారు అని అన్నారు. యువత భవితవ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోని విజయం సాధించాలి, మీరు అనుకున్న లక్ష్యాలను సాధించానుకుంటే నిబద్ధత కఠోర సాధన చేయాల్సి వుంటుంది. ముఖ్యంగా ప్రణాళికబద్ధంగా చదవడం ద్వారా మీ కలలను సాధించుకోవచ్చని, యువత తమ సమయాన్ని వృధా చేయకుండా కఠోర సాధనపై దృష్టి సారిస్తే అనుకున్న ఉద్యోగాలను సాధింగలరని అన్నారు.

పాఠశాల, కళాశాల స్థాయిలోనే కొందరు విద్యార్థులు పెడదోవ పడుతుండగా, వయసుతో సంబంధం లేకుండా కొత్తదనపు అనుభూతి కోసం చెడు అలవాట్ల వైపు దారి మరలుతున్నారు . యువత అనవసరంగా చెడు అలవాట్లకు బానిసై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు. యువతకి విద్య, ఉద్యోగ ఉపాధిలో పోలీసులు ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుంది అన్నారు. త్వరలో జరుగబోయే పోలీస్ ఉద్యోగాల నియామకాల్లో ఈ ప్రాంతం నుండి ఎక్కువ సంఖ్యలో యువత పోలీస్ ఉద్యోగంలో సెలక్ట్ కావాలి ప్రోత్స‌హించారు. దానికి సంబందించిన పూర్తి శిక్షణ కి పోలీస్ సహకరిస్తుంది అని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement