Monday, April 29, 2024

Yadadri – కమ్మిన ‘ముసురు’ ..ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రిబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో రాత్రి నుండి ఏక ధాటిగా ముసురు కమ్ముకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జిల్లాల్లోని పలు ప్రాంతాలు జలమయ మయ్యాయి. రోజంతా వర్షం కురవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. పలు ప్రాంతాల్లో ఇండ్ల లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూలీలు పనులకు వెళ్లకుండా ఉన్నారు. పంట పొలాలు నీటి తో నిండడం తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు నీట మునిగి నష్టాన్ని చేకూర్చింది. మూసి నది కురుస్తున్న వర్షాలతో ఉధృతంగా ప్రవహిస్తుంది. పోలీసులు ఆయా వాగులు, చేరువుల వద్ద బారిక్రేడ్లను ఏర్పాటు చేశారు.-

జిల్లాలో వర్షపాతం నమోదు

యాదాద్రి జిల్లాలో రోజంతా వర్షం కురుస్తూనే ఉంది..జిల్లాలో సరసరిగా 75.8 మీ మీ వర్షపాతం నమోదయింది. అడ్డగూడూర్ లో అత్యధికంగా 108.6 మీ.మీ, చౌటుప్పల్ లో 28.4,మీ, మీ అత్యల్ప వర్షపాతం నమోదయింది. రాజాపేటలో 85.4, ఆలేరు లో 94.2, మోటకొండూర్ లో 64.0, యదగిరిగుట్టలో 99.6, భువనగిరి లో 74.2, బొమ్మలరామారం లో 63.2, బీబీనగర్ లో 43.8, పోచంపల్లి లో 74.4, తుర్కపల్లిలో 98.2, నారాయణపూర్ లో 36.8, రామన్నపేటలో 64.4, వలిగొండ లో 68.6, ఆత్మకూరు ఎం లో 78.4, అడ్డగుడూర్ లో 108.6, గుండాలలో 108.0 మీ మీ వర్షపాతం నమోదైంది.

కూలిన ఇళ్ళు.. చేపట్టిన సహాయక చర్యలు

- Advertisement -

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట మండలం చల్లూరు గ్రామంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షలతో పాత ఇళ్ళు కూలిపోయాయి. బిష్ణు బ్రహ్మచారి, చిర్ర ప్రతాప్ రెడ్డి కుటుంబాలను తహశీల్దార్ రవి కుమార్, ఎస్సై సుధాకర్ రెడ్డి లు పరిశీలించి తాత్కాలికంగా పాఠశాలలో ఆవాసం కల్పించారు. రోడ్లు కొట్టుకపోగా, వాగులు ఉధృతంగా ప్రవహించడంతో భారీ క్రేడ్ల ను ఏర్పటు చేశారు. చెట్లు రోడ్డు పై పడగ తొలగించే చర్యలు చేపట్టారు.–

Advertisement

తాజా వార్తలు

Advertisement