Monday, May 6, 2024

కడం ప్రాజెక్ట్ ను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి – వరదలపై సమీక్ష

కడెం. జులై 27 ప్రభా న్యూస్ నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టు ను గురువారం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖ నాయక్ నిర్మల్ జిల్లా కలెక్టర్ కే వరుణ్ రెడ్డి నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ తో కలిసి రాష్ట్ర న్యాయ ఆటవి దేవాదాయ శాఖ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం కడెం జలాశయంలో వస్తున్న ఇన్ ఫ్లో వరద నీరు వరద గేట్ల పరిస్థితి పై నీటిపారుదల శాఖ అధికారులకు అడిగి తెలుసుకున్నారు కడెం ప్రాజెక్టు వరదగేట్ల పై నుండి ప్రవహిస్తున్న వరద నీరు లోతట్టు గ్రామాల ప్రజల తరలింపు ప్రాజెక్టుకు వరద ముప్పు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు

ఈ సందర్భంగా కడం ప్రాజెక్ట్ పై రాష్ట్ర మంత్రి ఐ.కే. రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టుకు చెందిన నాలుగు వరద గేట్లు మోర్రఇంచిన సందర్భంగా ప్రస్తుతం ప్రాజెక్టు చెందిన 14 వరద గేట్ల ద్వారా రెండు లక్షల 40 వేల క్యూసెక్కుల వీటిని గోదావరిలోకి విడుదల కొనసాగుతుంది కడెం ప్రాజెక్టు జలాశయం లో ప్రస్తుతం ఇన్ ఫ్లో నీరు తగుముఖం పడుతుందని ప్రాజెక్టు ఎలాంటి వరద ప్రమాదం ఉండ భొదని తెలిపారు కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో వరద నీరు అధికంగా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులకు రాష్ట్ర మంత్రి ఐ కే రెడ్డి సూచించారు ఆయన వెంట కడం ప్రాజెక్టు ఈ ఈ రాథోడ్ విఠల్ డి.ఈ. బోజదాసు నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి కడెం మండల తహశీల్దార్ చిన్నయ్య ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఖానాపూర్ సిఐ రవీందర్ నాయక్ కడెంఎస్సై కే. రాజు స్థానిక ప్రజాప్రతినితులు తదితరులున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement