Thursday, May 2, 2024

Tokyo Olympics: సెమీస్ చేరిన రెజ్లర్ భజరంగ్ పునియా

భారత్ ఫేవరెట్ రెజ్లర్ భ‌జ‌రంగ్ పూనియా టోక్యో ఒలింపిక్స్‌లో ఆశ‌లు రేపుతున్నాడు. 65 కిలోల ఫ్రీస్ట‌యిల్‌లో అత‌డు సెమీస్‌లోకి ఎంట‌ర్ అయ్యాడు. ఒక‌వేళ సెమీస్ గెలిస్తే ఏదో ఒక మెడ‌ల్ ఖాయం. లేదంటే అత‌ను బ్రాంజ్ మెడ‌ల్ కోసం మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం జరిగిన క్వార్టర్స్‌లో ఇరాన్‌కు చెందిన మోర్టేజ్ ఘైజీని భ‌జ‌రంగ్ పూనియా ఓడించాడు. 2-1 తేడాతో ఆ మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక సెమీస్‌లో అజ‌ర్‌బైజాన్ రెజ్ల‌ర్ హాజి అలియేవ్‌తో భ‌జ‌రంగ్ పూనియా త‌ల‌ప‌డ‌నున్నాడు. ఇవాళ మ‌ధ్యాహ్నం ఆ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మరోవైపు ప్రి క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో భ‌జ‌రంగ్ పూనియా.. కజకిస్థాన్‌కు చెందిన బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి ఎర్న‌జ‌ర్ అక్మ‌త‌లేవ్‌పై విజ‌యం సాధించాడు. ర‌స‌వ‌త్త‌రంగా సాగిన బౌట్‌లో పూనియా పాయింట్ల ఆధారంగా గెలుపొందాడు. నిజానికి ఇద్ద‌రూ 3-3 స్కోర్ చేసినా.. తొలి పీరియ‌డ్‌లో టేక్‌డౌన్ వ‌ల్ల బ‌జ‌రంగ్‌కు విజ‌యం ద‌క్కింది. ఫ‌స్ట్ పీరియ‌డ్‌లో భ‌జ‌రంగ్ పూనియా మూడు పాయింట్లు సాధించాడు. అయితే కజకిస్థాన్ ప్లేయ‌ర్ ఫ‌స్ట్‌ క్వార్ట‌ర్‌లో ఒక పాయింట్‌, సెకండ్ పీరియ‌డ్‌లో రెండు పాయింట్లు సాధించి స‌మంగా నిలిచాడు. కానీ విక్ట‌రీ బై పాయింట్స్ ఆధారంగా .. భ‌జ‌రంగ్ పూనియాను విజేత‌గా ప్ర‌క‌టించారు.

ఈ వార్తను కూడా చదవండి: రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలంటూ టాప్ బ్రాండ్ కంపెనీలకు సింధు నోటీసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement