Saturday, May 4, 2024

‘సర్కారు వారి పాట’పై తమన్ మరో ట్వీట్…అంతకు మించి!!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ ఇస్తూ అంచనాలను పెంచుతూ వస్తున్నారు.

తాజాగా మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఈ సినిమాపై హైప్ పెంచారు. అంతేకాకుండా మహేష్ బర్త్ డే కి ఒక వీడియో తో కూడిన ట్రీట్ ఉండబోతున్నట్లు కూడా హింట్ ఇస్తున్నాడు. అయితే ఆ వీడియో ఏంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అనేది మహేష్ ఫ్యాన్స్ లో ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అలాగే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement