Sunday, April 28, 2024

వ‌ర‌స్ట్ ఫెర్ఫామ‌ర్స్ వీరే..మ‌రోసారి జైలుకెళ్ల‌నున్న స‌న్నీ..

ఎట్ట‌కేల‌కు బిగ్ బాస్ హౌస్ లో ష‌ణ్ముఖ కెప్టెన్ అయ్యాడు. ఇక ఈ వారం వ‌ర‌స్ట్ పెర్ఫామ‌ర్ ఎవ‌ర‌నే దానిపై చ‌ర్చ జ‌రిగింది.
సంచాలకుడిగా జెస్సీ విఫలం కావడంతో ఆ కారణంగా అతన్ని వరస్ట్ పెర్ఫామర్ అని అన్నాడు సన్నీ. కాజల్.. శ్రీరామ్‌ని వరస్ట్ పెర్ఫామర్ అని .. ప్రోవోకింగ్ చేస్తున్నాడని ఆరోపించగా.. ప్రోవోకింగ్ గురించి నువ్ మాట్లాడుతున్నావా కాజల్ అంటూ ఇచ్చిపడేశాడు శ్రీరామ్. ఆ తరువాత పక్క వాళ్ల గేమ్ నువ్ ఆడకు అని కాజల్‌కి శ్రీరామ్ సలహా ఇవ్వడంతో నా ఇష్టం వచ్చినట్టు ఆడతా అంటూ రివర్స్ కౌంటర్ వేసేసింది. దీంతో శ్రీరామ్.. కాజల్‌ని వరస్ట్ పెర్ఫామర్‌గా నామినేట్ చేశాడు. ఇక రవితో పాటు షణ్ముఖ్‌తో సన్నీని వరస్ట్ పెర్ఫామర్‌గా నామినేట్ చేశాడు. సన్నీ చేతిలో ఉన్న బస్తాను తన్నడం తనకి నచ్చలేదని తనతో పాటు హౌస్‌లో ఉన్నవాళ్లకి నచ్చలేదని చెప్పాడు షణ్ముఖ్.

కాగా జెస్సీని నేను తన్నినట్టు చూపించమనండి.. ఇప్పటికిప్పుడు హౌస్ నుంచి వెళ్లిపోతా అని అన్నాడు సన్నీ. అనంతరం జెస్సీ వచ్చి గొడవను ఎక్స్ ప్లైన్ చేస్తుండగా.. ‘అసలు నీకు మాట్లాడే అర్హత లేదు.. సంచాలకుడిగా నువ్ అన్ ఫిట్ అనేశాడు దీంతో ఇద్దరి మధ్య మళ్లీ గొడవమొదలైంది.మొత్తంగా చూస్తే.. షణ్ముఖ్ సన్నీని వరస్ట్ పెర్ఫామర్ అని అన్నాడు కాబట్టి.. సిరి, జెస్సీలు కూడా సన్నీని వరస్ట్ పెర్ఫామర్‌గా నామినేట్ చేయడం పక్కా. ఇక రవి కూడా సన్నీని వరస్ట్ పెర్ఫామర్ అని చెప్తున్నాడు. ఆనీ మాస్టర్ కూడా సన్నీని వరస్ట్ పెర్ఫామర్ అనే అవకాశం లేకపోలేదు..

దీంతో ఈవారం వరస్ట్ పెర్ఫామర్ సన్నీ అయ్యే అవకాశమే ఉంది. కాజల్-సన్నీలకు వరస్ట్ పెర్ఫామర్‌గా ఎక్కువ నామినేషన్స్ రావడంతో ఫైనల్‌గా సన్నీ వరస్ట్ పెర్ఫామర్‌గా జైలుకు పోవడం ఖాయంగా కనిపిస్తుంది. గత వారం కెప్టెన్ అయిన సన్నీ తరువాత వారంలోనే వరస్ట్ పెర్ఫామర్ అవుతున్నాడు. అయితే సన్నీకి వరస్ట్ పెర్ఫామర్ ఇవ్వడం జైలుకి పంపడం ఈ సీజన్‌లో రెండోసారి. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి. ష‌ణ్ముఖ్..సిరి..జెస్సీలు క‌లిసి అడుతున్నార‌నే మాట‌ల‌కి మ‌రోసారి బ‌లాన్ని చేకూర్చారు. కాజ‌ల్ కి కూడా వ‌రస్ట్ ఫెర్ఫామ‌ర్ గా ఎక్కువ ఓట్లు ప‌డ్డాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement