Tuesday, March 26, 2024

రాజమౌళితో దిల్ రాజు సినిమా!

అగ్ర నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలను లైన్ లో పెట్టారు. గతంలో మీడియం బడ్జెట్ సినిమాలు తీసిన రాజు.. ఇప్పుడు భారీ ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పట్టాలెక్కిస్తున్నారు. అందులో శంకర్ – చరణ్ క్రేజీ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మరోవైపు వంశీ పైడిపల్లి – విజయ్ సినిమాను కూడా త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు దిల్ రాజు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమను తెరకెక్కించనున్నారు.

తాజాగా సంచలన దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళితో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. రాజమౌళి తదుపరి సినిమాకి దిల్ రాజు ఒక నిర్మాణ భాగస్వామిగా ఉండనున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. జకన్న సినిమా అంటే ఎంత బడ్జెట్ అవసరం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలే ఇందుకు ఉదాహరణ. రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ మహేష్ బాబుతో ఉండే అవకాశం ఉంది. అలాగే కేఎల్ నారాయణకి రాజమౌళి కమిట్ అయ్యాడు. దీంతో ఈ సినిమాకి దిల్ రాజు కూడా మరో నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: puneeth rajkumar: బెంగళూరుకు టాలీవుడ్ హీరోలు

Advertisement

తాజా వార్తలు

Advertisement