Tuesday, May 7, 2024

ఫాదర్స్‌ డే కోసం వండర్‌లా స్పెష‌ల్ ఆఫ‌ర్..

ఫాదర్స్‌ డే 2022 కోసం వండర్‌లా హాలిడేస్‌ అద్భుతమైన ఆఫర్‌ను ప్రకటించింది. నాలుగు టిక్కెట్‌లను కొనుగోలు చేసుకోవలసిన సందర్శకులు, మూడు టిక్కెట్లకు చెల్లించి, నాల్గవ టిక్కెట్టును తమ తండ్రికి ఫ్రీగా పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ వండర్‌లా బెంగళూరు, హైదరాబాద్‌, కొచ్చిలోని మూడు పార్కుల్లో జూన్‌ 19న మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు, 2021-22వ విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ప్లస్‌ 1, ప్లస్‌ 2 బోర్డు పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఎంట్రీ టిక్కెట్‌లపై ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ జూన్‌ 30 వరకు అమలులో ఉండ‌నుంది.. విద్యార్థులు 35శాతం తగ్గింపు ధరతో హైదరాబాద్ వండ‌ర్ లా పార్క్‌లోకి ప్రవేశించవచ్చు.

ఈ రాయితీని పొందేందుకు వారు తమ ఒరిజినల్‌ ఎగ్జామినేషన్‌ హాల్‌ టిక్కెట్‌లను వండర్‌లా కౌంటర్లలో చూపించవలసి ఉంటుంది. వండర్‌లా ప్రత్యేక ఆఫర్‌ ఇప్పటికీ జారీలోనే ఉందని, వండర్‌లాకు వచ్చే 22 ఏళ్ల లోపు విద్యార్థులు తమ కళాశాల ఐడీని టిక్కెట్‌ కౌంటర్‌లో చూపించి, తమ ఎంట్రీ టిక్కెట్లపై 20శాతం తగ్గింపు పొందవచ్చని పేర్కొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement