Monday, May 6, 2024

Womens Singles | యుఎస్ ఓపెన్ లో వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ కు షాక్..

యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో వ‌ర‌ల్డ్ నెం.1 ఇగా స్వియాటెక్ కు అన్ సీడెడ్ షాక్ ఇచ్చింది. ప్ర‌పంచ నెం.1తో జ‌రిగిన పోటీలో ప్రపంచ నెం.21 స్థానంలో ఉన్న‌ జెలెనా ఒస్టాపెంకో చేతిలో ఓడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ స్వియాటెక్, ఒస్టాపెంకోపై ఫ‌స్ట్ సెట్‌ని 6-3తో గెలుచుకోగా.. తర్వాతి రెండు సెట్‌లలో 6-3, 3-6, 1-6 తేడాతో ఆమె ప్రత్యర్థి జెలెనా ఒస్టాపెంకో చేతిలో ఓడిపోయింది. 1గం 48నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత ఓస్టాపెంకో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. ఇక‌, రేపు (మంగళవారం) జరిగ‌నున్న‌ క్వార్టర్ ఫైనల్లో అమెరికా ఆరో సీడ్ కోకో గౌఫ్‌తో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement