Sunday, May 5, 2024

‘మ‌హిళా ఎస్సై’ని కొనియాడిన పవ‌న్ క‌ల్యాణ్..ఎందుకో తెలుసా..

భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌లం అయిపోయింది చెన్నై. కాగా టీపీ చత్రమ్ ప్రాంతంలో స్పృహ కోల్పోయి, ప‌డిపోయిన 28 ఏళ్ల ఓ వ్య‌క్తిని తన భుజాలపై మోసుకెళ్లి ఓ మ‌హిళా ఎస్సై అతని ప్రాణాలను కాపాడింది. అక్కడే ఉన్న ఆటోలోకి ఎక్కించి అతనిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై దేశ వ్యాప్తంగా ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. స‌ద‌రు ఎస్సైని అభినందించారు జ‌న‌సేన అధినేత‌,ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్. భారీ వర్షాలలో సైతం భారమైనా బాధ్యతను నెరవేర్చిన పోలీసు అధికారిణి రాజేశ్వరి .. చెన్నై తుపాను సహాయక చర్యల్లో సృహ కోల్పోయిన వ్యక్తిని తన భుజంపై వేసుకొని ఆటోలో ఆసుపత్రికి తరలించి ఎందరికో మార్గదర్శిగా నిలిచారు. ఆమెకు వీరమహిళ విభాగం తరుపున సెల్యూట్’ అని జ‌న‌సేన వీర‌మ‌హిళా విభాగం ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. దాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ రీట్వీట్ చేశారు. ఆ మ‌హిళా ఎస్సై చేసిన ప‌ని ప్ర‌శంస‌నీయ‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. చెన్నైలో వ‌ర‌ద‌లు సంభ‌వించిన స‌మ‌యంలో మ‌హిళా ఎస్సై రాజేశ్వ‌రి త‌న సేవ‌లతో స్ఫూర్తిదాయ‌కంగా నిలిచార‌ని పవన్ కొనియాడారు. కాగా, ప‌లువురు ఐపీఎస్ అధికారులు కూడా మ‌హిళా ఎస్సై అందించిన సేవ‌ల‌ను కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement