Saturday, April 27, 2024

G-20 Summit | వచ్చేదెవరు, రానిదెవరు.. జీ-20 భేటీకి ప్రత్యేక ఆకర్షణగా బైడెన్‌, రిషి సునాక్‌

భారత్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడావ్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రోన్‌, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బెనెస్‌, జర్మనీ చాన్సెలర్‌ ఓలఫ్‌ షోల్జ్‌, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫొస, టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ టయ్యిప్‌ ఎర్డోగన్‌ హాజరవుతున్నారు.

చర్చలు, సహకారాన్ని విస్తృతం చేసే క్రమంలో జీ-20లో సభ్యత్వంలేని దేశాల అధినేతలకు భారత్‌ ఆహ్వానాలు పంపించింది. అలా ఆహ్వానాలు అందుకున్న దేశాల్లో బంగ్లాదేశ్‌, నెథర్లాండ్స్‌, నైజీరియా, ఈజిప్టు, మారిషస్‌, ఒమన్‌, సింగపూర్‌, స్పెయిన్‌, యూఏయీ ఉన్నాయి. సదస్సుకు హాజరుకాని ప్రముఖ దేశాధినేతల్లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, స్పెయిన్‌ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌, మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్‌ మాన్యుయెల్‌ లోపెజ్‌ ఓబ్రాడోర్‌ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement