Thursday, May 16, 2024

స‌ర్కారు బ‌డులు బాగుచేసేదెన్న‌డు..

ఈఏడాది 2021-22 బడ్జెట్‌ సమావేశాల్లో రూ.2 వేల కోట్లతో సర్కారు బడులను అభివృద్ధి చేస్తామని అంసెబ్లిలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అప్పట్లో ఈ పథకం అమలుకు మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రా రెడ్డి, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావులతో మంత్రుల సబ్‌ కమిటీని కూడా వేశారు. రెండు మూడు సార్లు ఈ కమిటీ సమావేశం అయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి దాదాపు 26 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలోని సమస్యలపై డీఈవోల నుంచి సమాచారం సేకరించారు. స్కూళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇంకా ఎలాంటి వసతులు కావాలి? అనే దానిపై సమాచారం తెచ్చుకున్నారు. అంతేకాకుండా పాఠశాల విద్యాశాఖ నుంచి అధికారుల బృంధాలు ఆంధ్రపదేశ్‌లో అమలవుతున్న నాడు-నేడు పథకం అమలును పరిశీలించి వచ్చారు. అక్కడ వాడే సాఫ్ట్‌వేర్‌ను కూడా తమకు ఇవ్వాలని ఇక్కడి అధికారులు వాళ్లకు లేఖలు కూడా రాశారు. దీనికి సంబంధించిన సమగ్ర రిపోర్టును విద్యాశాఖ అధికారులు సబ్‌కమిటీకి అందజేశారు. ఈక్రమంలో రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక యూటిట్‌గా తీసుకుని వాటిలోని స్కూళ్లను మొదటి విడతలో అభివృద్ధి చేయాలని మంత్రుల కమిటీ ఒక నివేదిక రూపొందించినట్లు తెలిసింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదటి విడతగా వీటిని అభివృద్ధి చేసి తర్వాత విడతల్లో మిగిలిన పాఠశాలలను అభివృద్ధి చేయాలని భావించారు. ఈ పథకం అమలుకు నిధుల కొరత లేకుండా ప్రజా ప్రతినిధులు వేతనాల నుంచి సుమారు 25 శాతం వరకు నిధులను కూడా వెచ్చించాలని నిర్ణయించారు. అయితే ఈ పథకం అమలుకు సంబంధించిన రిపోర్టును సీఎంకు మంత్రుల కమిటీ సమర్పించినట్లు సమాచారం. సీఎం తుది నిర్ణయం తీసుకుంటేగానీ ఈ పథకం ముందుకు నడవదనే అభిప్రాయాలను అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement