Tuesday, April 16, 2024

‘కిన్నెర‌సాని’ ట్రైల‌ర్

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ న‌టిస్తున్న తాజా చిత్రం కిన్నెర‌సాని. క్రైమ్, స‌స్పెన్స్, థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రంలో ర‌వీంద్ర విజ్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు. ఈచిత్రం నుండి ట్రైల‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రజనీ తాళ్లూరి , రవి చింతల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నీ ముందు ఉన్న సముద్రం అలలు చూడు. కోపగించుకుని సముద్రాన్ని వదిలి వెళ్ళిపోతున్నట్టు ఉన్నాయి. కానీ సముద్రం వాటిని వదలదు. వదులుకోలేదు నేను అంతే”అంటూ హీరోయిన్ శీతల్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ముఖ్యంగా కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్ ల నటన ఆకట్టుకునేలా సాగింది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ చిత్రం జనవరి 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement