Monday, April 29, 2024

ధనుర్మాస మహోత్సవములు

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో …

దివ్య సాకేత క్షేత్రములో …. ధనుర్మాస మహోత్సవములు

మన ఆచార్యుల దివ్య సన్నిధిలో గోదా అమ్మ వారు అనుగ్రహించిన ధనుర్మాస వ్రతమును అందరం కలిసి సేవించుకుందాం … ప్రతిరోజు ఉదయం గోదారంగనాథులకు అష్టోత్తర శతనామార్చన, తిరుప్పావై సేవాకాలం, ఆనాటి పాశుర వైభవమును ఆచార్యుల ద్వారా తెలుసుకుంటూ ధనుర్మాస వ్రతాన్ని జరుపుకుందాము.

విశేష కార్యక్రమాలు
10-1-2022 నుండి 13-1- 2022 వరకు
నీరాట్టోత్సవములు
11-1-2022 కూడారై
13 -1-2022 వైకుంఠ ఏకాదశి ఉత్సవం
14 -1-2022 గోదా కళ్యాణము
21 మందికి (21×100=2100)తదియారాధన కైంకర్యం చేసిన వారి గోత్రనామాలను పెరుమాళ్ళ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ప్రతి రోజు అర్చన జరుగును మరియు కల్యాణంలో కన్యాదాతగా కూర్చొనవచ్చును .

గోదారంగనాథులను ప్రార్థిస్తూ అందరికీ ఆరోగ్యాభివృద్ధి కలగాలని, ధనుర్మాస వ్రతాన్ని ఆచరిద్దాం…

- Advertisement -

జై శ్రీమన్నారాయణ

Advertisement

తాజా వార్తలు

Advertisement