Tuesday, May 14, 2024

ఇదేమ‌న్న సినిమా హాల్ అనుకున్న‌రా? ఐఏఎస్ ఆఫీస‌ర్‌కు హైకోర్టులో అక్షింత‌లు

అనేక హైకోర్టు విచారణలు ఇప్పుడు వెబ్‌కాస్ట్ అవుతున్నాయి. హైబ్రిడ్ ఆన్‌లైన్ యాక్సెస్ ద్వారా చూడ్డానికి అవ‌కాశం ఉంటోంది. కోర్టు విచారణల నుండి క్లిప్‌ల దాకా ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది. అన్నీ సోషల్ మీడియాలోకి వస్తున్నాయి. అయితే పాట్నా హైకోర్టు నుండి అలాంటి క్లిప్ ఒకటి ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

బిహార్‌లోని అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆనంద్ కిషోర్, పాట్నా హైకోర్టు ముందు కాలర్ ఓపెన్ చేసి వైట్ ష‌ర్ట్‌ తో హాజరైనందుకు జ‌డ్జీ సీరియ‌స్ అయ్యారు.

“కోర్టులో ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలో తెలియదా? ముస్సోరిలో ఐఏఎస్ ట్రైనింగ్ స్కూల్ కి వెళ్లలేదా?” అని సోషల్ మీడియాలో షేర్ చేసిన రెండు నిమిషాల క్లిప్‌లో ఐఏఎస్ అధికారిని జ‌డ్జీ ప్రశ్నించారు. ఇదేమిటి? బిహార్ రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారుల తప్పు ఏమిటి? కోర్టుకు ఎలా హాజరు కావాలో వారికి తెలియదు? ఫార్మల్ డ్రెస్ అంటే కనీసం కోటు.

కాలర్ ఓపెన్ చేయ‌కుండా ఉండాలి” అని జ‌డ్జి అన్నారు. ఈ స‌మ‌యంలో ఐఏఎస్ అధికారి ఆనంద్ కిషోర్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవ‌డానికిప్రయత్నించాడు. వేసవిలో కోటు ధరించడానికి అధికారిక కోడ్ లేదని తెలిపారు. ఈ వివరణ జ‌డ్జిని అంత‌గా ఇంప్రెస్ చేయ‌లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement