Tuesday, May 14, 2024

దేశంలో ప్రభుత్వ ఆస్తులు అమ్మి ఎన్నికల్లో ఖర్చు పెడతారు: మమతా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (ఎన్ఎంపీ) పాలసీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో ప్రధాని మోదీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. అమ్ముకోవడానికి దేశ ఆస్తులేమీ మోదీ సొంత ఆస్తులో, బీజేపీ ఆస్తులో కాదని ఆమె మండిపడ్డారు. దేశ ఆస్తులను ఇష్టానుసారం అమ్మడం కుదరదన్నారు. ఎన్ఎంపీ పాలసీ నిర్ణయం దురదృష్టకరమని, తమకు షాక్ కలిగించిందని మమత చెప్పారు.

దేశంలో ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ద్వారా వచ్చే డబ్బును ఎన్నికల్లో విపక్షాలను ఓడించేందుకు బీజేపీ సర్కారు వినియోగిస్తుందని మమత ఆరోపించారు. ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఈ నిర్ణయాన్ని యావత్ దేశం ఐకమత్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఎన్ఎంపీ పాలసీ ద్వారా రూ. 6 లక్షల కోట్ల వరకు డబ్బును సమీకరిస్తామని గత సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: సముద్రం నిన్న ముందుకు.. నేడు వెనక్కు.. అసలు ఏం జరుగుతోంది?

Advertisement

తాజా వార్తలు

Advertisement