Saturday, April 27, 2024

అష్టావధాని ‘అష్టకాల’ నిలవెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం : మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : ఇటీవల గుండె పోటుతో మృతి చెందిన అష్టావధాని, ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మిక సాహిత్య వేత్త అనంత సాగర్ సరస్వతి ఆలయ వ్యవస్థాపకులు అష్టకాల నరసింహ రామ శర్మ కుటుంబాన్ని మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అష్ఠకాల జ్ఞాపకార్థం ప్రతి ఏటా వారి శిష్యు బృందంచే అష్టావధానం ఏర్పాటు చేస్తామ‌న్నారు. అనంత సాగర్ ఆలయ ప్రాంతంలో నిలవెత్తు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇంత గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో ఉండటం మన అదృష్టం అని, సిద్దిపేటలో ఏదైనా భవనం వారి పేరు పెడతాతామ‌న్నారు. అవధానానికి ఆధ్యాత్మిక సాహిత్య రంగాలకు తీరని లోటు అన్నారు. భావి తరానికి అష్టకాల జీవిత చరిత్ర మార్గదర్శకం కావాల‌న్నారు. సీఎం కేసీఆర్ నాకు అత్యంత ఆత్మీయుడు అని వారి అనుబంధం ఉంది అన్నారు.

వైదికాన్ని అవపోసన పట్టి వేలాది మంది శిష్యులను వైదికంగా తయారు చేసి, దేశంలో గొప్పగా వందలాది అష్టావధానాలు చేసి అవధాని గా మన ప్రాంతానికి వన్నె తెచ్చిన గురువు అష్టకాల వారు, అవధానాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనంత సాగర్ ప్రాంతంలో గొప్ప సరస్వతి అమ్మవారి ఆలయాన్ని నిర్మించి సామాజిక సేవగా సమాజానికి స్పూర్తినిచ్చారు, ఎంతో మంది అవదానులను తీర్చిదిద్దారు అన్నారు. అవధాన శిరోమణిగా పెరుగాంచిన శర్మ అవదానం ప్రపంచ తెలుగు మహా సభల్లో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 500 పైగా సరస్వతి యజ్ఞ యగాలు నిర్వహించి అమ్మవారి మహత్యాన్ని సమాజానికి చాటి చెప్పారు అన్నారు. ఎన్నో ఆలయాలు వారి చేతుల మీదుగా ప్రతిష్ఠ లు జరిగాయ్, ధర్మ సందేహాల ఎన్నో సలహాలు సూచనలు ఇచ్చి నివృత్తి చేసే వారు వారి సేవలు చిరస్మరణీయం అన్నారు. వారి జీవితం భావి తరానికి మార్గదర్శనం కావాలి, వారి మరణం ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్య రంగాలకు, అవదానానికి తీరని లోటు అన్నారు. సామజిక , ఆధ్యాత్మిక సేవకు మారు పేరుగా నిలిచిన వారి సేవలను కొనసాగిస్తాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement