Sunday, May 5, 2024

చేప‌ల పెంప‌కాన్ని ప్రోత్స‌హిస్తున్నాం : మంత్రి తలసాని

దేశంలో ఎక్క‌డా లేని విధంగా సబ్సిడీమీద రోయ్య పిల్లలను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. రాష్ట్రంలో చేపల పెంపకాన్ని పోత్సహిస్తున్నామ‌న్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. చేపల మార్కెటింగ్ లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గతంలో 647 సొసైటీలు ఉంటే.. ఇప్పుడు 5112కు పెంచుకున్నామన్నారు. ఈ ఏడాది కొత్తగా లక్ష మందికి సభ్యత్వం ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. 2021-22లో 4.4 టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంటే.. 3.89 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించామన్నారు. 2022-23లో 4.67 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. 2021-22లో 23,263 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 23,748 నీటి వనరుల్లో చేప పిల్లలను వదిలామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement