Friday, May 3, 2024

స‌ర‌దా కాదు.. చ‌దువు కోసం – స‌వాళ్ల స‌వారీ

గుర్రాలపై బడికి వెళుతున్న గిరిజన పిల్లలు
ప్రతి రోజు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం
7 గుర్రాలు… 9 మంది విద్యార్థులు
ఆదివాసీలే పెంకుల పాఠశాల నిర్మించుకున్నారు
అల్లూరి జిల్లా-అనకాపల్లి జిల్లా సరిహద్దులో సమస్యల కొలిమిలో ఓ గిరిజన గ్రామం

విశాఖపట్నం,ప్రభ న్యూస్‌ : మహావిశాఖనగరం బీచ్లో సరదా కోసం పిల్లలు గుర్రమెక్కి స్వారీ చేస్తుంటారు..కానీ మారు మూల లోతట్టు- గిరిజన గ్రామంలో చదువుకోసం చిన్నారులు గుర్రాలపై అష్టకష్టాలు పడుతూ పాఠశాలకు చేరుతున్నా రు.ఆధునిక డిజిటల్‌ యుగాలు.పిల్లలు చదువుకోవాలంటే స్మార్ట్‌ ఫోన్స్‌,ట్యాబ్స్‌,వర్చువల్‌ క్లాసెస్‌..ఇలా ఎన్నోసదుపా యాలు ఉంటు-న్నాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని ఊళ్ళల్లో ఇంకా పాఠశాలలకు వెళ్లాలంటే చాలా కష్టాలు పడుతూ ఉన్నారు. కొన్ని గ్రామాలు మారుమూలన ఉండడం.. ప్రభుత్వాలు వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం వంటి ఎన్నో కారణాలవలన ఆయాగ్రామాలకు చెందిన పిల్ల లు చదువుకోవాలంటే కొన్ని రిస్క్‌ లు కూడా తీసుకోకతప్ప డం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇటు- అనకాపల్లి జిల్లా సరిహద్దులో నేరేడుబందనే ఓచిన్న ఆదివాసీ కుగ్రా మం.వీరంతా అల్లూరిజిల్లా జి.మాడుగుల మండలంలో నేరేడుబందగ్రామం నుంచి అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని జెడ్‌.జోగుంపేట ప్రాధమిక పాఠశాలకు రోజూ గుర్రాలపై విద్యార్థులు వెళ్తుంటారు.బడికి వచ్చేందుకు రెండు జిల్లాల మధ్య వీరు రోజూ సాహసయాత్ర చేస్తున్నా రు.వీరంతా పాఠశాలను చేరుకునేందుకు రోజూ ఐదు కిలోమీ టర్లు గుర్రాలపై ప్రయాణం చేస్తున్నారు.ఈ గ్రామానికి వెళ్లాలంటే దారితెన్నే లేదు. వాగులు,పుట్ట లు,డొంక లు,కొండలెక్కి దిగి వెళ్లాల్సిందే.

ఈ గ్రామంలో 70మంది గిరిజనులు నివాసం ఉంటు-న్నారు. వీరిలో 20 మంది బడి వయసున్న బాలబాలికలు ఉన్నారు.గత ఏడాది వరకు వీరిలో ఒక్కరూ బడి ముఖం చూసి ఎరుగరు. దీంతో ఐదో తరగతి వయసున్న పిల్లలకు కూడా అ,ఆ లంటే తెలియని పరిస్థితి.నేరేడుబందలో పాఠశాల లేకపోవడంతో పిల్లలు చదువుకోలేకపోతున్నారు. మైదాన ప్రాంతం పాఠశాలకి వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు దారికూడా లేని అడవిని దాటు-కుని రావాలి. అక్కడ ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. అది అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలం జెడ్‌.జోగుంపే ట గ్రామ పరిధిలోకి వస్తుంది.గిరిజన సంఘాలు నేరేడుబంద గ్రామానికిరోడ్డు,బడికావాలని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు.అయితే గ్రామానికి బడి, దారి ఏర్పాటు- చేయలేదు కానీ,కొందరు ఉపాధ్యాయులను అక్కడికి పంపించి,చదువు ప్రాధాన్యం,అమ్మఒడిపథకం గురించి వారికి వివరించారు. తమ పిల్లలు చదువుకోవడం తోపాటు- అమ్మఒడి పథకం ద్వారా కొంత ఆర్థిక ఆసరా వస్తుం దని పిల్లలను పాఠశాలకు పంపించేందుకు తల్లిదండ్రులు అంగీకరించారు.రోడ్డు మార్గం లేకపోవడం,అంతా అడవే కావడంతో గుర్రా లపై పిల్లలను బడికి పంపుతున్నారు. రోడ్డు మార్గం లేని తూ ర్పు కనుమల్లోని కొన్ని గ్రామాల్లో గిరిజనులు, ఆదివా సీలు రాకపోకలు సాగించేందుకు గుర్రాలను వాడుతుంటారు.

కొత్త‌వాళ్ల‌ను చూస్తే గ్రామ‌స్తుల‌లో భ‌యం
గుర్రాలపై తమ పిల్లలను బడికి పంపుతున్న గ్రామస్థుల్లో భయం కనిపిస్తోంది.పైగా వాళ్లు వెళ్తున్న మార్గం మధ్యలో ఏదైనా ప్రమాదం జరుగుతుందా అనే ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.గ్రామానికి తెలియని ముఖాలు ఎవరైనా వెళ్తే తమ పిల్లలకు ఏదైనా జరిగిందేమో, ఆ కబురు తెచ్చారేమోననే భయం నేరేడుబంద గ్రామస్థుల్లో కనిపిస్తుం టు-ంది. పిల్లలను బడికి తీసుకునే వెళ్లే పనిని గ్రామంలోని కొందరు యువకులు రోజువారీ పనిగా నిర్ణయించుకుని చేసు ్తన్నారు.ఉదయాన్నే బడికి బయలుదేరిన పిల్లల్ని గ్రామం నుంచి గుర్రాలపై ఎక్కించుకుని జి.మాడుగుల మండలం లోని జెడ్‌.జోగుంపేట పాఠశాలకు తీసుకుని రావడం,మళ్లీ సాయంత్రం వరకు అక్కడే ఉండి,తిరిగి పిల్లలను గ్రామాలకు తీసుకుని వెళ్లడం వీరి పని.

- Advertisement -

ఏ రాజ‌కీయ నాయ‌కులూ సాయం చేయ‌లేదు…
ఎలాగోలా పిల్లలు చదువుకుంటే మంచిదే కదా.అందుకే కొండ కింద బడికి పంపుతున్నాం. అసలు గత ఏడాది వరకు మా పిల్లలకు బడి ఎలాగుంటు-ందో తెలియదు.ఏ అధికారి, రాజకీయ నాయకులు కూడా మాకు ఏవిధమైనా సహాయం చేయలేదు.ఇప్పుడు పిల్లలకు కష్టమవుతుందని గుర్రాలపై వెళ్లేందుకు గ్రామస్థులమంతా కలిపి మార్గం ఏర్పాట్లు- చేసుకు న్నాం. నేరేడుబంద గ్రామ పెద్ద డిప్పల అప్పారావు తెలిపారు.

స‌మ‌స్య‌ల కొలిమిలో నేరుడుబంద‌
నేరేడుబంద గ్రామంలో బడి,రోడ్డు మాత్రమే కాదు విద్యుత్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇలా చాలా సమస్యలే ఉన్నాయి. వీటన్నింటిని అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకొ లేదంటు-న్నారు గిరిజన సంఘాల ప్రతినిధులు.మిగతా సమస్యలను పక్కన పెట్టినా వెంటనే గ్రామంలో ప్రాథమిక పాఠశాల,రోడ్డు మార్గం నిర్మించాలి.చదువు కోసం ప్రమా దకర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉండ కూడదు. స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా గుర్రాల మీద స్కూ లుకు చేరుకొనే పరిస్థితి ఉందంటే ప్రభుత్వాలు ఏ విధంగా పని చేస్తున్నాయో,ముఖ్యంగా ఆదివాసీలకోసం ఎలాంటి శ్రద్ధ చూపుతున్నాయో అర్థం అవుతోంది అని ఏపీ గిరిజన సం ఘం నాయకుడు గోవిందరావు ఆవేదన వ్యక్తం చేశారు.

స్వ‌చ్చంధంగా ర‌హ‌దారి నిర్మాణం
గ్రామంలో ఉన్న ఏ-కై-క మట్టిరోడ్డు పూర్తిగా పాడైం ది. బ్రిటీ-ష్కాలంలో పేపర్‌ తయారికోసం వెదురు కర్రలను సరఫరా చేయడానికి వేశారు. కాలక్రమే ణా అది పూర్తిగా ధ్వంసమైంది. దీంతో నేరేడుబం డ గ్రామ చిన్నారులు స్కూల్కు పోయేం దుకు రోజూ కిలోమీటర్లు కొండదిగి వెళ్లాల్సి వచ్చేది. అయితే రోడ్డు దెబ్బతినడంతో ఇప్పుడు కనీసం సైకిల్‌ కూడా వెళ్లడం కష్టమే..! కొన్ని వారాల క్రితం, గిరిజనులు ద్విచక్ర వాహనాలు,వారి గుర్రాలు తరలిం చడానికి వీలుగా దారిని పు నరుద్ధరించారు. పల్లాపెద్దా అన్న తేడా లేకుండా అందరూ కలిసి కేవలం మూడు రోజుల్లోనే రోడ్డు మార్గాన్ని పూర్తిగా విని యో గంలోకి తీసుకువచ్చారు. తమ గ్రామంలో చాలా సమ స్యలు ఉన్నాయని..వాటిని అధికారులు పట్టించుకోవాలని గ్రామస్థులు కోరారు.

ప‌రిష్కారానికి ప్ర‌య‌త్నిస్తాం..రోణంకి
నేరేడుబంద గ్రామంలో గుర్రాలపై పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థుల కష్టాన్ని గుర్తించాను.నేరేడుబంద గ్రామాన్ని సందర్శించి అక్కడ ఆదివాసుల పరిస్థితిని పరిలీలించా ను. వారితో గ్రామసభ నిర్వహించాను. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. నా పరిధిలో ఉన్న నిధులతో వారు కోరుతున్న రోడ్డు,స్కూల్‌ నిర్మాణం అవుతుందా,లేదంటే నిధులకోసం ప్రభుత్వానికి నివేదిక పంపలా అనేది పరిశీలిస్తున్నాం. ఏదేమైనా రహదారి,పాఠశాల ఏర్పాటు-కు చర్యలు చేపడతాను.

ఏడు గుర్రాలు – తొమ్మిది మంది విద్యార్ధులు
గ్రామంలో 1 నుంచి 5తర గతి వరకు చదివే వయసున్న బాలబాలికలు 20 మంది ఉన్నారు.వీరిలో తొమ్మిది మంది జెడ్‌. జోగుంపేట పాఠశాలలో ఈ ఏడాది ప్రవేశాలు పొందారు. వీరంతా తమ వయసు తగ్గ తరగతి లో కాకుండా తక్కువ స్థాయి తరగ తుల్లోనే ప్రవేశాలు చేరారు. ఎందుకం టే 3,4 తరగతి చదివే వయసున్న పిల్లలు కూడా అ,ఆలు చెప్పలేక పో తున్నారు. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు పాఠశాలకు రోడ్డు మార్గం లేకపోయినా తమ పిల్లలను గుర్రాలపై రోజు బడికి పంపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement