Monday, April 29, 2024

యాసంగి సాగుకు నీటి ప్రణాళిక.. త్వరలో ప్రకటించనున్న ఇరిగేషన్‌ శాఖ

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ: ఆరుదశాబ్దాల నిశ్శబ్దం అనంతరం స్వరాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఉపిరిపోసుకుని రాష్ట్ర చరిత్రను తిరగరాస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర, దక్షిణ తెలంగాణలో నిర్మించిన రిజర్వాయర్లు యాసంగి పంటకు పుష్కలంగా నీరు అందించేందుకు ఉవ్విల్లు ఊరుతున్నాయి. ఒకప్పుడు వానచినుకులకోసం నింగికి చూసే రైతులు తమదృష్టిని మళ్లించుకుని పంటపొలాలో గలగల పారుతున్న కృష్ణా, గోదావరికి మొక్కులు తీర్చుకుంటున్నారు. వరుణి కనికరంతో పుష్కలంగా నిండిన జలాశయాల నుంచి యాసంగి పంటకు నీరందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలను రూపొందిస్తుంది. 2022-23 లో ప్రాజెక్టుల వారీగా యాసంగి సాగుకు ప్రభుత్వం అంచనావేస్తుంది. లక్షల ఎకరాల సాగుకు నీరిచ్చే ప్రతిపాదనలను ప్రభుత్వం ఇప్పటికే సిద్దంచేస్తుంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు జలకళ రావడంతో అధిక దిగుబడిని రాబట్టేందుకు వరితోపాటు, ఆరుతడిపంటలకు నీరిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల వారిగా నివేదికలను సిద్ధం చేసింది. రాష్ట్ర స్థాయి సమగ్ర నీటి ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అయితే ప్రస్తుతం యాసంగిలో 33,46,013 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. అలాగే ఆరుతడి పంటలు పండించేందుకు రైతులు సిద్ధమైతే మరో 30 లక్షల ఎకరాలకు కూడా నీరు అందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అధికారులు చెపుతున్నారు.

శ్రీరాంసాగర్‌, నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల్లో అంచనాలకు మించి నీరు నిల్‌ండటం పట్ల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తుూ నీటి విడుదలకు రంగం సిద్ధం చేశారు. ప్రధాన ప్రాజెక్టులతోపాటు చెరువులు, కుంటల్లో నీటిమట్టాలు ఘననీయంగా ఉన్నాయి. అలాగే ఎల్లంపల్లి, మధ్యమానేరు, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ తదితర రిజర్వాయర్ల సైతం అందుబాటులోకి రావడం ప్రస్తుతం యాసంగికి అనుకూలంగా మారింది. కుమరం భీం, నల్లవాగు, నీల్వాయి, కౌలాస్‌ నాలా, చనాకా కొరాట. చిన్న కాళేశ్వరం, లక్నవరం, రామప్ప, సుద్ధవాగు, వట్టి వాగు, ఎల్లంపల్లి, సింగూరు, నిజాంసాగర్‌, కడెం తదితర మధ్యతరహా ప్రాజెక్టులద్వారా సాగుభూమి సస్యశ్యామలమ్యే అవకాశాలు అధికంగా ఉండటంతో కొత్తగా వేలాది ఎకరాల స్థిరీకరణ జరగనుందని నీటిపారుదల శాఖ నివేదికలో స్పష్టం చేసింది. ప్రస్తుతం యాంసంగి పంటకు 60 టీఎంసీ నీటిని సునాయసంగా విడుదల చేసే అవకాశాలున్నాయి. మైక్య పాలనలో తెలంగాణలోని ప్రాజెక్టుల నుంచి 20 లక్షల ఎకరాలలోపు సాగుభూమికి నీరు అందేది. ఇందులో బోర్లద్వారా కూడా పంటలు పండించిన లెక్కలున్నాయి. అయితే ఈ నీటితో ఆరుతడి పంటలు పండించేందుకే సరిపోయేదికాదు. కానీ ప్రస్తుతం సీన్‌ మారింది. మేజర్‌, మీడియం ప్రాజెక్టుల కిందనే 35 లక్షల కు పైగా ఎకరాలకు యాసంగిలో నీరు అందటంరాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయగాధ.

శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవనం తో లక్షల ఎకరాలకు సాగునీరు

- Advertisement -

గోదావరి నదీ పై అనేక ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు ఊదరకొట్టిన సమైక్య పాలకులు ప్రాజెక్టులు నిర్మించకప్రకటనలకే పరిమితం కావడంతో ఎండిపోయిన శ్రీరాం సాగర్‌ కు పునరుజ్జీవం పోసి లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికలను రూపొందించారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రస్తుతం రెండు తడిపంటలకు నీరు అందించేస్థాయికి ఎదిగింది. సమైక్యపాలనలో శ్రీరాంసాగర్‌ ఎండడిపోగా అందులోంచి వేసిన బస్సు రోడ్డును మళ్లించి నీటిని నింపి ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టును 1953లో ప్రతిపాదిస్తే 1963లో శిలాఫలకం పడింది. అనంతరం ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమేరకు ప్రాజెక్టుపనులు జరిగినప్పటికీ ఎగువ మహారాష్ట్ర గోదావరిపై ప్రాజెక్టులు నిర్మించడంతో ప్రాజెక్టు వర్షంపై ఆధారపడింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌ కు నీటి తరలించి లక్షల ఎకరాలకు తెలంగాణ ప్రభుత్వం నీరు అందిస్తుంది.

దశాబ్దాల అనంతరం ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో జలసిరులు కురుస్తున్నాయి. అలాగే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి 347 కిలో మీటర్ల పరిధిలో నిర్మించిన కాకతీయ కాల్వద్వారా నీరు పరవళ్లుతొక్కుతుంది.ప్రస్తుత యాసంగికి శ్రీరాంసాగర్‌ ద్వారా 24,30,753 ఎకరాలకు నీరు అందించేందుకు ఇరిగేషన్‌ శాఖ ప్రణాళిక రూపొందించింది. గతంలో 10 లక్షల ఎకరాలకు కూడా నీరందివ్వని శ్రీరాంసాగర్‌ ఉత్తరతెలంగాణ సస్యశ్యామలంలో ప్రముఖ పాత్ర వహించడం గమనార్హం.ఎస్‌ఆర్‌స్పీ ప్రతిపాదిత లక్ష్యం నెరవేర్చడమేకాదు ఆయకట్టుకు శాశ్వత భరోసాను కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement