Friday, March 24, 2023

చికెన్‌ బిర్యానీకే ఓటు ఆన్‌లైన్‌లో అత్యధికంగా ఆర్డర్లు దీనికే

హైదరాబాద్‌ : ఫుడ్‌ డెలివరీ సంస్థ సిగ్గ్వీ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌తో పాటు, తెలంగాణాలోని ఇతర ప్రాంతాల్లోనూ అత్యధిక డిమాండ్‌ ఉన్న ఫుడ్‌ ఐటమ్‌గా చికెన్‌ బిర్యానీ నిలిచింది. అత్యధికంగా ఆన్‌లైన్‌లో కస్టమర్లు చికెన్‌ బిర్యానీనే ఆర్డర్‌ చేశారు. మూడు సంవత్సరాలుగా కస్టమర్ల ఫేవరేట్‌ ఐటమ్స్‌ చికెన్‌ బిర్యానీనే. స్నాక్స్‌లో ఇడ్లీనే ఎక్కువ మంది ఆర్డర్‌ చేస్తున్నారు. చికెన్‌ బిర్యానీ తరువాత ఆఫ్రికాట్‌ డిలైట్‌, మటన్‌ బిర్యానీ ఉన్నాయి. స్నాక్స్‌లో ఇడ్లీ తరువాత మస్కా బన్‌, మసలా దోసెను ఎక్కువగా ఆర్డర్‌ చేస్తున్నారు.

డ్రింక్స్‌లో థమ్స్‌ఆప్‌, నాన్‌ డిష్‌ ఐటమ్స్‌లో పాల ఉత్పత్తులు, టామాటాలు ఉన్నాయి. టాప్‌ మూడు డిజర్ట్స్‌లో ఆఫ్రికాట్‌ డిలైట్‌, డబుల్‌కా మీటా, ఫ్రూట్‌ సలాడ్స్‌, ఐస్‌ క్రిమ్స్‌ఉన్నాయి. వేలాది మంది కొత్త కస్టమర్లు సిగ్గ్వీ ఇన్‌స్టామార్ట్‌ ద్వారా కిరాణా సరుకులు, కూరగాయలు వంటివి ఆర్డర్‌ చేస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement