Saturday, March 23, 2024

తెలంగాణకు అరకొరగా ఆయుష్మాన్ నిధులు.. బీఆర్ఎస్ ఎంపీ నామ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ‘ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాన్టక్చర్ మిషన్’ పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తున్న నిధులు మరీ అరకొరగా బీఆర్ఎన్ లోక్‌సభాపక్ష నేతనామ నాగేశ్వరరావు అన్నారు. ఈ విషయమై గురువారం పార్లమెంటులో ప్రశ్నించగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పట్ల వివక్ష చూపినట్టుగా తేటతెల్లమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య అవసరాలకు తగినట్టుగా కేంద్రం నుంచి నిధుల కేటాయింపులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా రూ.584.04 కోట్ల నిధులను ఈ పథకం కింద విడుదల చేయగా.. తెలంగాణకు మాత్రం కేవలం రూ.11.25 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుందని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

అలాగే 2022- 23 ఆర్థిక సంవత్సరంలో పథకానికి  రూ.4176.84 కోట్లు కేటాయించగా తెలంగాణకు రూ. 102.91 కోట్లు మాత్రమే ఇచ్చి వివక్ష చూపిందని ఆరోపించారు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ కేటాయింపులు మరింత స్వల్పంగా, దారుణంగా ఉన్నాయని నామ అన్నారు. గుజరాత్ రాష్ట్రానికి 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 118.30 కోట్లు, జార్ఖండ్ కు రూ. 240.16 కోట్లు, మహారాష్ట్రకు రూ.130.79 కోట్లు, ఉత్తరప్రదేశ్ కు  రూ. 650.23 కోట్లు కేటాయించారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement