Monday, April 29, 2024

విక్రాంత్ రోణ -మూడు రోజుల్లో రూ.1.91కోట్ల షేర్

క‌న్న‌డ స్టార్ హీరో కిచ్చా సుదీప్ న‌టించిన విక్రాంత్ రోణ చిత్రానికి తెలుగులో కోటిన్న‌ర వ‌ర‌కు థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. మూడు రోజులు పూర్త‌య్యే సరికి ఈ చిత్రం రూ.1.91 కోట్ల షేర్‌ను సాధించి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. పోటీగా తెలుగు స్ట్రైయిట్ సినిమా ఉన్నా ఈ చిత్రం కేవ‌లం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుందంటే విశేషం అనే చెప్పాలి. ఇలానే కంటిన్యూ అయితే ఈ చిత్రం ఫైన‌ల్‌గా ప‌ది కోట్ల వ‌ర‌కు షేర్‌ను సాధిస్తుంద‌న‌డంలో అతిశ‌యోక్తి కాదు. ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్‌, ఇన్‌వేనియో ఫిలింస్ ఇండియా సంస్థల‌తో క‌లిసి సుదీప్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కించాడు. బాలీవుడ్ భామ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. ఇక ఈ ఏడాది క‌న్న‌డ నుండి వ‌చ్చిన ‘జేమ్స్’, ‘కేజీఎఫ్‌-2’, ‘చార్లీ777’ సినిమాలు కూడా టాలీవుడ్‌లో మంచి విజ‌యాలు సాధించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement