Friday, March 29, 2024

12మిలియ‌న్ ల‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టిన – మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం ట్రైల‌ర్

రాజ‌శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం.ఈ చిత్రం ట్రైల‌ర్ దూసుకుపోతోంది. హీరో నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాకి, రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు.ఈ సినిమాలో కృతి శెట్టి – కేథరిన్ కథానాయికలుగా అలరించనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో రాజేంద్రప్రసాద్ .. సముద్రఖని .. వెన్నెల కిశోర్ .. మురళీశర్మ .. ఇంద్రజ కనిపించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. కామెడీ ప్రధానమైన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, ఈ సినిమాలో మాస్ కంటెంట్ పుష్కలంగా ఉందనే విషయాన్ని చెప్పేసింది. యూ ట్యూబ్ లో ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ 12 మిలియన్ కి పైగా వ్యూస్ ను రాబట్టేసింది. 24 గంటలు పూర్తయ్యేసరికి ఏ మార్క్ ను టచ్ చేస్తుందనేది చూడాలి. మహతి స్వరసాగర్ సంగీతాన్ని సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement