Friday, May 3, 2024

మోదీ ప్రభుత్వానికి వ్యాపారం తప్ప.. వ్యవసాయం తెలియ‌దు : మంత్రి నిరంజన్‌ రెడ్డి

దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మోదీ ప్ర‌భుత్వానికి వ్యాపారం త‌ప్ప వ్య‌వ‌సాయం తెలియ‌ద‌ని మంత్రి అన్నారు. వ్యవసాయం బాగుంటే అందరూ బాగుంటారు.

అన్నం పెట్టే రైతుకు చేయూతనిస్తే అందరికీ అండగా ఉంటారన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగానికి చేయూతనిస్తుండటంతో రైతాంగం కోట్ల టన్నుల వరి ధాన్యం పండిస్తే నేను కొనలేను అని కేంద్రం, నరేంద్రమోదీ చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. ఎక్కడైనా పంట పండించమని అంటారు. కానీ పంట పండించవద్దని చెబుతున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ అని విమర్శించారు. బీజేపీకి అధికారం ఇస్తే రైతులను నిలువునా ముంచేస్తారు. మోదీ ప్రభుత్వానికి వ్యాపారం తప్ప.. వ్యవసాయం తెలియదన్నారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులన్నీ తెలంగాణకు అన్యాయం చేసేవే అన్నారు. కాంగ్రెస్ నిర్మించిన శ్రీశైలం, కల్వకుర్తి ఎత్తిపోతల పంప్ హౌస్ లు పలుమార్లు మునిగాయి. ప్రకృతి విపత్తును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రతి పక్షాలు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement