Friday, May 3, 2024

సోము వీర్రాజు వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అంటూ బీజేపీ నేత సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘తిరుపతి ఉపఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉపఎన్నికలో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి. చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

కాగా ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని సోము వీర్రాజు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్ అంటే ప్రధాని మోడీ, అమిత్ షాకు అమితమైన అభిమానం అని.. పవన్‌కు సముచిత గౌరవం ఇవ్వాలని మోదీ తనకు సూచించారని వీర్రాజు పేర్కొన్న సంగతి విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement