Wednesday, May 1, 2024

‘మహా’ సంకటం.. శివసేనలో గుబులు!

మహారాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. మహారాష్ట్రలో మరోసారి రాజకీయాలు మ‌హారాస‌వ‌త్త‌రంగా మారేలా క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభాన్ని సృష్టించేందుకు బీజేపీ మైండ్ గేమ్ మొద‌లు పెట్టినట్లు తెలుస్తోంది. శివ‌సేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న ఎన్సీపీని పావుగా వాడుకుంటోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రహస్యంగా భేటీ అయ్యారనే ప్రచారం గుప్పుమన్నాయి.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ విషయంలో ఎన్సీపీ వైఖరిపై శివసేన అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వీరి భేటీపై ప్రచారం జరగడం సంచలనంగా మారింది. అయితే, అమిత్ షాతో శరద్ పవార్ భేటీని ఎన్‌సీపీ వర్గాలు కొట్టిపారేస్తున్నప్పటికీ.. బీజేపీ వర్గాలు మాత్రం ఖండించలేదు.

పవార్‌తో భేటీపై స్పందించేందుకు నిరాకరించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా… అన్నీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. దీన్నిబట్టి అమిత్ షా-పవార్ భేటీ నిజమేననే వాదన బలంగా వినిపిస్తోంది. మహారాష్ట్ర సర్కారుకు కొత్త గుబులు రేపేలా ఆయన వ్యవహరించారన్న అభిప్రాయం కలుగుతోంది. శరద్ పవార్ తో తాను భేటీ అయ్యానన్నట్లుగా వస్తున్న ప్రచారానికి బలం కలిగించేలా ఆయన స్పందన ఉంది.

మరోవైపు మ‌హారాష్ట్ర‌లోని సంకీర్ణ స‌ర్కార్‌ను కూల‌దోసేందుకే ఇలాంటి వ‌దంతులు సృష్టిస్తున్నారని ఎన్సీపీ వర్గాలు అంటున్నాయి.   ఇప్ప‌టికే లుక‌లుక‌ల‌తో సాగుతున్న ఉద్ధ‌వ్ ఠాక్రే ప్ర‌భుత్వం.. మ‌నుగ‌డ‌పై అనుమానాలు మొద‌ల‌య్యాయి. పవర్‌ అమిత్‌షా భేటీ అయ్యారన్న ప్రచారం శివసేనలో గుబులు రేపుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement