Thursday, May 2, 2024

ప్రైవేటు కూత…విజయవాడ రైల్వేస్టేషన్ 99 ఏళ్ల లీజుకు రంగం సిద్ధం

విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరించేందుకు రైల్వేబోర్డు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. 99 ఏళ్ల పాటు ప్రైవేటుపరం చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసిందట. కమర్షియల్ ఆదాయం కోసం ఇప్పటికే ఈస్ట్ ఫేసింగ్-1, 2 బుకింగ్ కౌంటర్లను అండర్ గ్రౌండ్ లోకి చేర్చింది. ఇక ఇప్పుడు మొత్తం విజయవాడ రైల్వేస్టేషన్‌ను కమర్షియల్ గా మార్చటానికి రైల్వేబోర్డు నిర్ణయించింది. కానీ అది వీలు కాకపోవడంతో తాజాగా కార్పొరేట్ కంపెనీలకు గుత్తంగా రైల్వేస్టేషన్లను దీర్ఘకాలం అప్పగిస్తే మంచిదనే ఆలోచనకు వచ్చింది. ఈ క్రమంలో కొన్ని రైల్వేస్టేషన్లను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు నిర్ణయించారు. అందులో విజయవాడ ఏ1 రైల్వేస్టేషన్‌ కు కూడా స్థానం కల్పించారు.

ఇక ఇప్పుడు దీనిపై రైల్వే ఉద్యోగుల లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విజయవాడ రైల్వేస్టేషన్ సదుపాయాల పరంగా దిబెస్ట్ స్టేషన్. ఇక పది ప్లాట్‌ఫాంలను అనుసంధానం చేస్తూ మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి. వీటిలో ఒకటి మెగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి. లిఫ్ట్ఎస్కలేటర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. జనరల్, నాన్ ఎన్, ఏసీ రెవరూమ్స్ అదనపు ఆకర్షణ. పే అండ్ యూజ్ టాయ్ లెట్లతో పాటు ప్రయాణికులకు డిస్ప్లే సిస్టమ్, ఆధునికీకరించిన పాటఫాంలు, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ల వినియోగం, క్లీన్ అండ్ గ్రీన్ వంటి సదుపాయాలతో నేషనల్ గ్రీన్ బిల్లింగ్ కౌన్సిల్ గోల్డెన్ అవార్డును సాధించింది. ఐఎస్పీ హోదా ప్రత్యేకం.

ఇక సరకు రవాణాలో విజయవాడ డివిజన్ నుంచి దేశ రైల్వేకు గణనీయమైన ఆదాయం వస్తోంది. ఒకానొక దశలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇలాంటప్పుడు ఈ రైల్వేస్టేషన్‌ను ప్రైవేట్ చేతుల్లో పెట్టడం కంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకునైనా రైల్వేనే సొంతంగా రీ డెవలప్మెంట్ వంటి వాటితో పాటు కమర్షియల్ గా అభివృద్ధి చేయవచ్చు. దీనివల్రైల్వేస్టేషన్ రైల్వేశాఖ నియంత్రణలోనే ఉండటంతో పాటు ఆ ఫలాలను నేరుగా పొందవచ్చు. అలా కాదని ప్రైవేటుపరం చేస్తే 99 ఏళ్ల పాటు ఆ ఆదాయం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుంది. ప్రయాణికుల పైనా యూజర్ చార్జీల భారం పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement