Monday, April 29, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ రికార్డ్.. కోటీ 80 లక్షల ఫాలోవర్స్

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాల మాట ఎలా ఉన్నా..త‌న‌కి ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు.. తాజాగా తన సోషల్ ప్లాట్‌ఫాంలో హీరో విజయ్ దేవరకొండ రేర్ ఫిట్ సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్ దేవరకొండకి ఏకంగా 18 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు. కోటీ 80 లక్షల ఫాలోవర్స్ తో విజయ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలకున్న క్రేజ్‌ను విజయ్ దేవరకొండ చాలా తక్కువ టైమ్ లో.. చాలా అలవోకగా అందుకోవడంతో ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే.. గీతా గోవిందం తరువాత విజయ్ దేవరకొండ కు సాలిడ్ హిట్ అంటూ పడలేదు. ఒక్క టాక్సీవాలా మాత్రమే పర్వాలేదు అనిపించింది. ఆతరువాత వచ్చిన సినిమాలన్నీ ధారుణంగా పోయాయి. అయినా సరే పట్టుదలతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈసినిమా హిట్ అయితేనే.. విజయ్ దేవరకొండ కెరీర్ కాస్త గాడిన పడుతుంది. లేదంటే..విజయ్ కెరీర్ డేంజర్ జోన్ లో పడినట్టే అని చెప్పవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement