Monday, April 29, 2024

మెగాస్టార్ చిరంజీవికి విషెస్​.. కల్కి మూవీ నుంచి వీడియో లీక్!

రెబల్ స్టార్ ప్రభాస్ ని సూపర్ హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రొడక్షన్ విషయంలో మూవీ యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. సినిమా సెట్స్ నుంచి ఎటువంటి లీక్స్ జరగకుండా జాగ్రత్త పడుతోంది. అయితే, తాజాగా డైరెక్ట్ ఎడిటింగ్ రూమ్ నుంచే వీడియో లీక్ చేశారు మేకర్స్. మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ అంటే ఓ రేంజ్ ఉండాలని ఫీల్ అయ్యారో ఏంటో కానీ, మూవీలోని ఒక క్లిప్ ని లీక్ చేశారు.

కల్కి ఎడిటింగ్ రూమ్ నుంచి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ.. ఎడిటింగ్ చేస్తున్న వీడియోని షేర్ చేశారు నిర్మాతలు. దానిలో ప్రభాస్ ఏదో గ్యాడ్జెట్ ని రెడీ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే వెల్డింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు. దీనికి చిరు గ్యాంగ్ లీడర్ మ్యూజిక్ పెట్టి.. చిరంజీవి గ్యాంగ్ లీడర్ పోస్టర్ ని ప్రభాస్ రీ క్రియేట్ చేశాడు. ఇక ఈ వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఆ వీడియోని ఒకసారి మీరుకూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement