Sunday, April 28, 2024

వీరసింహారెడ్డి నుండి మా బావ మనోభావాలు సాంగ్ రిలీజ్.. బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే

హీరో బాలకృష్ణ ..గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న చిత్రం వీర సింహారెడ్డిలో నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న మూవీ విడుదల కానుంది. మా బావ మనోభావాలు అంటూ స్పెషల్​ సాంగ్​తో సందడి చేశారు.

ఇందులో కేరళ బ్యూటీ హనీరోజ్, మరో భామ చంద్రిక రవితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేశారు బాలయ్య. ఈ సాంగ్​ వింటే ఆడియెన్స్​కు మరోసారి పూనకాలు రావడం ఖాయం. కాగా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదల చేసి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించారు మేకర్స్. ఆ తర్వాత వీర సింహా రెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేసి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతి హాసన్ హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 80 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేశారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement