Wednesday, May 8, 2024

Exclusive | తీర్పుపై వనమా రివ్యూ పిటిష‌న్‌.. విచారణ కు స్వీకరించిన హైకోర్టు

తనపై వేసిన అనర్హత పిటీషన్ పై సుప్రీంకోర్టు అప్పీల్ కు వెళ్లాడానికి అవకాశం ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఈ రోజు (బుధ‌వారం) హైకోర్ట్ లో పిటీషన్ వేశారు. వనమా పిటీషన్ ను హైకొర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ఇవ్వాల 1 గంటకు సింగల్ బెంచ్ ముందు వాదోపవాదాలు జరగనున్నట్లు సమాచారం.

ఇక‌.. వ‌న‌మా ఎన్నిక చెల్ల‌ద‌ని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు లో పిటిషన్ వేయ‌డానికి అవకాశం ఇవ్వాలని, మంగళవారం వచ్చిన తీర్పు అమలు వాయుదా వేయాలని ఎమ్మెల్యే వనమా వెంక‌టేశ్వ‌ర‌రావు తరుపు న్యాయవాది కోర్టు కు అప్పీల్ చేసినట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement