Sunday, May 19, 2024

ఏకలవ్య పాఠశాలల్లో ఖాళీ పోస్టులు.. భర్తీ కోసం కేంద్రం చ‌ర్య‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులతోపాటు బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, ఒడియా, తెలుగు, ఇంగ్లీష్‌, గణితం, సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌, ఉర్దూ, సంస్కృతం తదితర సబ్జెక్టుల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుచేసుకునే అభ్యర్థులు టీజీటీ పోస్టులకు పీజీ, బీఈడీతోపాటు సీటెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement