Sunday, May 5, 2024

అమెరికాలో మళ్లీ కరోనా విజృంభణ..

కరోనా వైరస్ అమెరికాను మళ్లీ పట్టిపీడిస్తోంది. వ్యాక్సినేషన్‌ వేగంగా జరగడంతో అమెరికాలో కొవిడ్‌ కాస్త అదుపులోకి వచ్చినట్లే కనిపించినా… డెల్టా తరహా కొత్త వేరియంట్ల వల్ల కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రెండు వారాల్లోనే ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సంఖ్య ఏకంగా 70 శాతానికి పైగా పెరిగింది. మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఒక్కరోజు వ్యవధిలో కరోనాతో చనిపోయిన అమెరికన్ల సంఖ్య వెయ్యి దాటింది. గంటకు 42 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు తేల్చారు.

వైరస్‌ తీవ్రత తగ్గాక చాలా ప్రాంతాల్లో మాస్కులు ధరించడంపై ప్రభుత్వం ఆంక్షలు సడలించింది. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో… పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. స్పాట్… నెల రోజులుగా అమెరికాలో కరోనా కేసులు, మరణాలు అనూహ్యంగా పెరిగాయి. రోజూ సగటున 769 మంది కరోనాకు బలవ్వగా… తాజాగా ఒక్కరోజులో ఒక వెయ్యి 17 మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు వదిలారు. అగ్రరాజ్యంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6 లక్షల 22 వేలు దాటింది. వైరస్‌ తీవ్రత పెరగడంతో మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ హెచ్చరించింది. ముఖ్యంగా వ్యాక్సిన్‌ తీసుకోనివాళ్లంతా ప్రమాదపుటంచున ఉన్నట్లేనని పేర్కొంది.
ఇది కూడా చదవండి: దళితబంధు పథకాన్ని కేసీఆరే కోర్టుకు వెళ్లి ఆపుతారు: ఈటెల

Advertisement

తాజా వార్తలు

Advertisement