Thursday, March 23, 2023

దళితబంధు పథకాన్ని కేసీఆరే కోర్టుకు వెళ్లి ఆపుతారు: ఈటెల

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించన దళిత బంధు పథకంపై బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటెల సంచలన ఆరోపణలు చేశారు. దళిత బంధు పథకాన్ని ప్రతిపక్షాలు ఆపుతాయని టీఆర్ఎస్ నేతలు చెప్పడం సరికాదని.. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆరే కోర్టుకు వెళ్లి ఆపి వేయించేస్తారని ఈటెల ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిన్న దళిత సంఘాల ఆధ్వర్వంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన బొండిగ పిసికేందుకే కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారన్ని ఈటెల ఎద్దేవా చేశారు. నాలుగేళ్లలో దళితబంధు పథకాన్ని రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, కానీ 40 ఏళ్లైనా అమలు సాధ్యం కాదన్నారు. దళితులను కేసీఆర్ మొదటి నుంచి దగా చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. పథకం అమలుకు రూ. 2.5 లక్షల కోట్లు అవసరమని, బడ్జెట్ లేకుండా పథకం అమలు ఎలా సాధ్యమని ఈటెల ప్రశ్నించారు.

- Advertisement -
   

ఈ వార్త కూడా చదవండి: హైదరాబాద్‌లో దారుణం.. యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

Advertisement

తాజా వార్తలు

Advertisement