Friday, May 3, 2024

ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం..

ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉప్పల్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లిఫ్టులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మొదటి అంతస్థుకు వెళ్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది ఈ సంఘటనతో అప్రమత్తమైన ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది.. లిఫ్ట్ తలుపులను తెరిచి అందరినీ బయటకు తీశారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు అందరు సురక్షితంగా బయట పడ్డారు. కాగా, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ మందముళ్ల పరమేశ్వర్‌లకు స్వల్ప గాయాలు అయ్యాయి. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: ఈటల వల్లే దళిత బంధు: ఈటల జమున

Advertisement

తాజా వార్తలు

Advertisement