Saturday, April 20, 2024

తెలంగాణలో కొత్తగా 623 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 623 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 746 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం 9,188 క‌రోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. హెచ్ఎంసీ పరిధిలో 70, కరీంనగర్ జిల్లాలో 68, వరంగల్ అర్బన్ జిల్లాలో 67 కొత్త కేసులు వెలుగు చూశాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,43,716 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,30,732 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనా మృతుల సంఖ్య 3,796కి పెరిగింది. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.98 శాతంగా న‌మోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement