Sunday, April 28, 2024

WPL | టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూపీ !

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌లో భాగంగా నేడు యూపీ వారియర్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మద్య మ్యాచ్ జరగనుంది. కాగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూపీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచి 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. మరోవైపు UP జట్టు 6 మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచి 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని ఢిల్లీ భావిస్తుండగా, ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలవాలని యూపీ పట్టుదలతో ఉంది.

యూపీ వారియర్స్ అంచనా జట్టు:

అలిస్సా హీలీ (c & wk), కిరణ్ నవ్‌గిరే, చమరి అథాపత్తు/తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, దీప్తి శర్మ, ఉమా చెత్రీ/పార్షవి చోప్రా, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, రాజేశ్వరి గయాక్‌వాడ్, సాయి

ఢిల్లీ క్యాపిటల్స్ అంచనా జట్టు :

- Advertisement -

మెగ్ లానింగ్ (సి), షఫాలీ వర్మ, అలిస్ క్యాప్సే, జెమిమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, జెస్ జోనాస్సెన్, తానియా భాటియా (WK), అరుంధతి రెడ్డి, టిటాస్ సాధు, శిఖా పాండే, రాధా యాదవ్

Advertisement

తాజా వార్తలు

Advertisement