Monday, May 13, 2024

యూజీ ఆయూష్ కన్వీనర్ కోటా సీట్లకు 11,12,తేదిల్లో వెబ్ ఆప్షన్లు

వరంగల్, ప్రభ న్యూస్ : యూజీ ఆయూష్ కోర్సుల్లో కన్వీనర్ కోటా రెండవ విడత సీట్లకు వరంగల్ లోని కాళోజి నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని ఆయూష్ కళాశాల ల్లో హోమియోపతి, బీఏఎంఎస్, బీహెచ్ ఎంఎస్, బి ఎన్ వైసీ, బీయూఎంఎస్, కోర్సుల్లో ఖాళీ సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. తుది మెరిట్ జాబితాలో ని అర్హులైన విద్యార్థులు 11వ తేది ఉదయం 8గంటల నుంచి, 12వ తేది సాయంత్రం 4 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement