Thursday, May 16, 2024

గ్రామీణం, పట్టణం ఏదైనా తెలంగాణ నెంబర్‌ వన్‌.. ట్విట్టర్‌లో మంత్రి ఎర్రబెల్లికి కేటీఆర్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రామీణాభివృద్ధి అయినా.. పట్టణాభివృద్ధి అయినా సీఎం కేసీఆర్‌ సమ్మిళిత వృద్ధి మోడల్స్‌కు ఎవరూ సాటిరారని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణకు 19 అవార్డులు దక్కడంపై కేటీఆర్‌ #హర్షం వ్యక్తంచేశారు. జాతీయ అవార్డు అందుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌కు, మంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చేసిన ట్వీట్‌కు కేటీఆర్‌ ట్విట్టర్‌లో స్పందిచారు. ’19 అవార్డులు గెలుచుకున్న పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. సిరిసిల్ల జిల్లా పరిషత్‌కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement