Thursday, May 9, 2024

నిరుద్యోగులకు శుభవార్త.. నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఉగ్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. తెలంగాణలో కొలువుల జాతర మొదలైంది. పీవీ నరసింహారావు, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీల్లో పలు ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.

తెలంగాణలో త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు వివిధ శాఖల్లో ఖాళీల లెక్కలను తేల్చారు. ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన అనంతరం రాష్ట్రంలో మొత్తం ఖాళీల సంఖ్య 55 వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వవర్గాల అంచనా. ఏప్రిల్ నెలాఖరు నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

అయితే, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 127 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్ అసిస్టెంట్ విభాగంలో 15 ఖాళీలు, జూనియర్ అసిస్టెంట్ విభాగంలో మరో 10 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయంలో 105 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలను సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్ లో ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన సంస్థలో డిప్లొమో చేసి ఉండాలి.  మరన్ని వివరాల కోసం tspsc.gov.in. వెబ్ సైట్ సందర్శించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement