Wednesday, May 15, 2024

కేంద్ర విధానాలపై టీఆర్‌ఎస్ నిరసన.. ప్రజా సమస్యలపై చర్చ జరపాలని డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర డిమాండ్ల సాధనకు టీఆర్‌ఎస్ పార్లమెంట్ సాక్షిగా పోరాటం సాగిస్తోంది. ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఉభయ సభల్లో గురువారం ఆందోళన ఉద్ధృతం చేసింది. కేంద్రంపై పోరాటంలో కలిసివచ్చే విపక్షాలను కలుపుకుపోతూ నిరసన వ్యక్తం చేస్తోంది. నిత్యావసరాలపై అధిక మొత్తంలో జీఎస్టీ విధింపు, ధరల పెరుగుదల అంశాలపై చర్చ జరపాలని లోక్‌సభ, రాజ్యసభలో టీఆర్‌ఎస్ ఎంపీలు పట్టు పట్టారు. దీంతో లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం రాజ్యసభ ఎంపీలూ గళం విప్పారు. ప్రజా సమస్యలపై చర్చ జరపాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పట్టుబట్టారు. ఛైర్మన్‌కు ఎంత విజ్జప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య, కె.ఆర్ సురేశ్ రెడ్డి, బండి పార్థసారథి రెడ్డి, దామోదర్‌రావు పోడియం వైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో పలు విపక్షపార్టీలు కూడా టీఆర్ఎస్ ఆందోళనకు మద్దతు పలికాయి. చర్చకు అనుమతించకుడా, విపక్ష సభ్యుల డిమాండ్లను పట్టించుకోకుండా ఛైర్మన్ సభను వాయిదా వేశారు. తిరిగి రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడా టీఆర్ఎస్ ఎంపీలు చర్చకు డిమాండ్ చేయడంతో మళ్లీ వాయిదా వేశారు. దీంతో టీఆర్ఎస్ ఎంపీలు విపక్ష పార్టీల ఎంపీలతో కలిసి రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement